బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌పై విడాకుల రూమర్స్ ఇటీవల ఎక్కువయ్యాయి. అయితే, ఆ జంట తమ చర్యల ద్వారా ఆ పుకార్లను ఖండిస్తోంది. పూణెలో జరిగిన కుటుంబ కార్యక్రమంలో ఐశ్వర్య, అభిషేక్ స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ‘బంటీ ఔర్ బబ్లి’ చిత్రంలోని ‘కజ్రారే’ పాటకు స్టెప్పులు వేసి సందడి చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవలి కాలంలో ఐశ్వర్య రాయ్ ఒంటరిగా కనిపించడం వల్ల పలు పుకార్లు పుట్టుకొచ్చాయి. కూతురు ఆరాధ్యను మాత్రమే వెంటబెట్టుకుని కొన్ని కార్యక్రమాలకు హాజరుకావడం, అభిషేక్ దూరంగా కనిపించడం వీటికి కారణమైంది. 2007లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు 2011లో ఆరాధ్య జన్మించింది. ఇటీవల ఆరాధ్య పుట్టిన రోజు వేడుకల్లో కూడా అభిషేక్ లేకపోవడం విడాకుల రూమర్‌లకు బలం చేకూర్చింది.
తాజా వీడియోలో ఐశ్వర్య, అభిషేక్ కలిసి డ్యాన్స్ చేయడం, ఆ మధుర క్షణాలను ఎంజాయ్ చేయడం పుకార్లకు చెక్ పెట్టినట్లైంది. అభిమానులు ఈ వీడియోపై హర్షం వ్యక్తం చేస్తూ, జంట మధ్య బంధం ఇంకా బలంగా ఉందని అభిప్రాయపడుతున్నారు.

One thought on “విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టిన ఐశ్వర్య-అభిషేక్ జంట”
Comments are closed.