ఐశ్వర్య రాజేష్ – ప్రతిభకు మరింత మెరుపు జోడిస్తున్న అందం

Aishwarya Rajesh Viral Photoshoot

దక్షిణ భారత సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటిమణి ఐశ్వర్య రాజేష్. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆక్టివ్‌గా సినిమాలు చేస్తూ అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇటీవల ఈమె షేర్ చేసిన ఫోటోషూట్ పిక్స్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. అందాల ఆరబోతకు మారుపేరు అన్నట్టుగా ఆమె లుక్ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

1990 జనవరి 10న చెన్నైలోని ఓ తెలుగు కుటుంబంలో జన్మించిన ఐశ్వర్య, చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకుంది. ఆమె తండ్రి రాజేష్ తెలుగు సినీ నటుడు కాగా, తల్లి నాగమణి ఓ డాన్సర్. అలాగే ఆమె తాత అమర్‌నాథ్, అత్త శ్రీలక్ష్మి వంటి కుటుంబసభ్యులంతా సినీ నేపథ్యం కలిగినవారే కావడం విశేషం.

తిరుపతి, చెన్నైలో విద్యాభ్యాసం చేసిన ఐశ్వర్య, చివరగా ఇతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి బీకామ్ పట్టా పొందింది. చదువులోనూ మంచి ప్రతిభ కనబర్చిన ఈ భామ, సీనియర్ నటీనటుల కుటుంబంలో పుట్టినప్పటికీ తన కెరీర్‌ను పూర్తిగా సొంతంగా నిర్మించుకుంది. తమిళ చిత్రాల్లో స్టేడీ కేరియర్ కొనసాగిస్తూ, మంచి పేరు తెచ్చుకుంది.

తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ్ ఇండస్ట్రీలో స్టార్‌గా ఎదిగిన ఐశ్వర్య, 2019లో “కౌసల్య కృష్ణమూర్తి” సినిమాతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ వంటి సినిమాల్లో నటించినా, పెద్దగా హిట్ కాలేదు. కానీ 2025 సంక్రాంతికి విడుదలైన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ఆమెకు మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ప్రస్తుతం ఐశ్వర్య తమిళంలో “కరుప్పర్ నగరం”, “మోహన్ దాస్”, “తీయవర్ కులైగల్ నడుంగ్” చిత్రాలతో పాటు కన్నడలో “ఉత్తరాఖండ్” సినిమాలో నటిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజా లుక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అభిమానులు ఈమె గ్లామర్, టాలెంట్ మిక్స్‌కు ఫిదా అవుతున్నారు.

Read More



One thought on “ఐశ్వర్య రాజేష్ – ప్రతిభకు మరింత మెరుపు జోడిస్తున్న అందం

Comments are closed.