పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు అగ్రహారానికి చెందిన మద్దా దానియేలు అనే వ్యక్తి తన భార్యను తుర్కియే (టర్కీ) నుండి రక్షించాలని విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెంకి చెందిన కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావును కలిసి ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా దానియేలు మాట్లాడుతూ… ఏడునెలల క్రితం తన భార్య రహేలు ఖతార్ వెళ్లిందని, అక్కడి ఏజెంట్ మోసం చేసి ఆమెను తుర్కియేకు పంపించాడని చెప్పారు. ప్రస్తుతం తుర్కియేలో ఒక యజమాని ఆమెను గృహబంధిగా ఉంచి, అన్నం కూడా పెట్టకుండా భారం పని చేయిస్తున్నాడని వాపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న తాము ఇద్దరూ చిన్నారులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నామన్నారు.
అంతేకాకుండా, రహేలు తండ్రి ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, ఆమెను చూసే అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. ఈ విషయాన్ని కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షుడు మాణిక్యాలరావు దృష్టికి తీసుకెళ్లిన దానియేలు, తమ కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరించారు.
వెంటనే స్పందించిన మాణిక్యాలరావు, భారత ఎంబసీతో సంప్రదించి వీలైనంత త్వరగా రహేలు ఖతార్‌ను స్వదేశానికి రప్పించే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ ఘటన పట్ల స్థానికంగా చర్చ జరుగుతోంది.
Read More : నేడు శ్రీశైలంలో సీఎం పర్యటన…

2 thoughts on “తుర్కియేలో భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్న యజమాని…”
Comments are closed.