ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు (మంగళవారం) శ్రీశైలాన్ని సందర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి, శ్రీశైలం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీశైలం ప్రాజెక్ట్ వద్ద జరిగే జలహారతి కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం నీటి వినియోగ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమవ్వనున్నారు.
ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు, శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
Read More : వైఎస్సార్ 76వ జయంతి… ఇడుపులపాయలో జగన్ నివాళి

One thought on “నేడు శ్రీశైలంలో సీఎం పర్యటన…”
Comments are closed.