సోషల్ మీడియా వ్యసనంలో తల్లిదండ్రులు ఎక్కడి వరకు పోతారన్న దానికి రాజస్థాన్‌లోని భారత్పూర్ జిల్లాలోని సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం ఓ తండ్రి తన కుమార్తె ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడు. భారత్పూర్ జిల్లా బంద్ బరైతా రిజర్వాయర్ వద్ద ప్రమాదకరమైన ఇనుప ఫ్రేమ్ పై తన కుమార్తెను బలవంతంగా కూర్చోబెట్టి వీడియో తీశాడు ఉమాశంకర్ అనే వ్యక్తి. చిన్నారి భయపడుతూ ఉన్నా ఆమెను బెదిరించి రిజర్వాయర్‌పై ఇనుప నిర్మాణంపై కూర్చోబెట్టిన తండ్రి చర్యలకు తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఫ్రేమ్‌పై కనీస భద్రతా ఏర్పాట్లేవీ లేకపోయినప్పటికీ, ఉమాశంకర్ రీల్ తీశారు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేయడంతో లైక్స్, వ్యూస్ కోసం పిల్లల ప్రాణాలతో చెలగాటమా అంటూ నెటిజన్లు ఘాటు విమర్శలు గుప్పించారు.
సోషల్ మీడియాలో ఎదురవుతున్న తీవ్ర ఆగ్రహాన్ని గమనించిన ఉమాశంకర్ చివరికి ఆ వీడియోను డిలీట్ చేశాడు. ఈ ఘటన తల్లిదండ్రుల బాధ్యతలపై మరోసారి ప్రశ్నలు రెదిలేలా చేసింది.
పిల్లల భద్రతను పక్కనబెట్టి వైరల్ వీడియోల కోసం ప్రాణాలను పణంగా పెట్టడం సరికాదన్న సున్నితమైన సందేశాన్ని నెటిజన్లు స్పష్టంగా ఇస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.
Read More : తుర్కియేలో భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్న యజమాని…

One thought on “రీల్స్ పిచ్చిలో చిన్నారి ప్రాణాన్ని పణంగా పెట్టిన తండ్రి…”
Comments are closed.