రేవంత్ రెడ్డి అలా చెప్పడం సరికాదు – ఎమ్మెల్యే

హైదరాబాద్: మొదటిసారి రేవంత్ రెడ్డి పై బహిరంగంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక పోస్టు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ “పదేళ్లు తానే సీఎం అని రేవంత్ చెప్పడం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం.. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాలతోనే ఎన్నిక ఉంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం ఎన్నిక జరుగుతుంది. తెలంగాణలోని పార్టీని వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలు సహించం. నిఖార్సయిన నేతలు, కార్యకర్తలు ఎవరూ ఇలాంటివి సహించరు” అని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై సీఎం, ఇతర నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read More : అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో ప్రజలు అవస్థలు