బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చుంకీ పాండే వారసురాలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, తక్కువ కాలంలోనే స్పెషల్ క్రేజ్ సంపాదించింది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ మూవీతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన అనన్య, వరుస అవకాశాలతో బిజీ అయింది. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’లో నటించినా, ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
ఇప్పుడు అనన్య పాండే ‘కేసరి చాప్టర్ 2’ సినిమాతో ప్రేక్షకులను అలరిస్తోంది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా, జలియన్ వాలా బాగ్ మారణహోమం నేపథ్యంలో తెరకెక్కింది. కరణ్ త్యాగి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్. మాధవన్, అనన్య పాండే కీలక పాత్రల్లో నటించారు. సినిమా మంచి కోర్ట్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలో అనన్య పాండే నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కెరీర్‌లో నెవ్వర్ బిఫోర్ అనిపించే విధంగా ఆమె పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. కరణ్ త్యాగి తన తొలి సినిమాతోనే టాలెంట్‌ను చూపించి, అనన్యలోని నటనా నైపుణ్యాలను బాగా వెలికితీశారని నెటిజన్లు కొనియాడుతున్నారు.
ప్రస్తుతం ‘కేసరి చాప్టర్ 2’ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ప్రీ బుకింగ్స్‌లో జోష్ కనిపిస్తుండగా, మే 1వ తేదీ వరకు పెద్దగా పోటీ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ను కొనసాగించే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో సినిమాకు మరింత ఆదరణ ఎంత పెరుగుతుందో చూడాలి.

One thought on “నెవ్వర్ బిఫోర్: కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన అనన్య పాండే”
Comments are closed.