తమిళ్ హీరో స్వల్ప గాయం..

తమిళ స్టార్ హీరో అజిత్‌కు ఢిల్లీలోని పద్మ భూషణ్ అవార్డు కార్యక్రమం ముగిశాక తిరిగి చెన్నై చేరిన సందర్భంగా ఎయిర్‌పోర్టు వద్ద అభిమానుల భారీ పోగు నెలకొంది. ఆయనను చూసేందుకు ఎగబడిన అభిమానుల మధ్య తోపులాట జరగడంతో అజిత్ స్వల్పంగా గాయపడ్డారు.

ఈ తోపులాటలో ఆయన కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. వెంటనే దగ్గరలో ఉన్న వైద్య సిబ్బంది స్పందించి అజిత్‌ను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. గాయం పెద్దది కాకపోయినప్పటికీ పూర్తిగా విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్టు సమాచారం.

అభిమానుల ప్రేమను అజిత్ ఎప్పుడూ మెచ్చుకుంటారన్న విషయం తెలిసిందే. కానీ ఈ విధమైన అపశృతులు జరుగకుండా ఉండేందుకు పోలీసులు, ఫ్యాన్స్ సంఘాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని అభిమానులే అభిప్రాయపడుతున్నారు.

ఇటీవలే అజిత్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ గౌరవాన్ని అందుకున్నారు.

Read More : ముంబై నటి జత్వానీ కేసులో కీలక మలుపు