విశాఖలో AI యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు: మంత్రి నారా లోకేష్

nara lokesh

విశాఖలో AI యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు: మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యూనివర్సిటీ మరియు స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఐటీ మరియు విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… సీఎం చంద్రబాబు దీని కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారని తెలిపారు. విద్యా రంగంలో ఉన్న లోపాలను సరిచేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంలో ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు-2025ను సభలో ప్రవేశపెట్టారు.

2016 ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులో మార్పులు

మంత్రి లోకేష్ వివరించిన మేరకు, 2016లో ప్రవేశపెట్టిన ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులో కొన్ని లోపాలు ఉన్నాయని గుర్తించి వాటిని సరిదిద్ది సరికొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ మార్పుల ద్వారా విద్యార్ధులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు.

అమరావతిలో BITS ప్రాంగణానికి స్థల కేటాయింపు

అంతేగాక, మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. అమరావతిలో బిట్స్ (BITS) ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడానికి 70 ఎకరాల భూమి కేటాయించామని వెల్లడించారు. ఈ నిర్ణయం సోమవారం కేబినెట్ సమావేశంలో తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రణాళిక

డీప్ టెక్ విశ్వవిద్యాలయం ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ రంగంలో ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి నారా లోకేష్ వివరించారు.

ఈ చర్యల ద్వారా రాష్ట్రంలో ఉన్నత విద్య రంగం అభివృద్ధి చెందడంతోపాటు యువతకు నూతన అవకాశాలు కల్పించబడతాయని మంత్రి నారా లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Read More