మెడికల్ కాలేజ్ విద్యార్థి తృటిలో ప్రాణాలతో బయటపడ్డ కథ.

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఒక విద్యార్థి తృటిలో ప్రాణాలు దక్కించుకున్న సంఘటన కలచివేస్తోంది. బీజే మెడికల్ కాలేజీ భవనంపై విమానం కూలిన సమయంలో అక్కడ ఉన్న విద్యార్థులు ప్రాణాలను రిస్కులో పెట్టుకొని బయటపడిన తీరును వివరించారు.

ప్రమాద సమయంలో భోజనానికి మెస్‌కు వెళ్లినట్లు విద్యార్థి పేర్కొన్నారు. “మధ్యాహ్నం 1:30 గంటలకు, మేము భోజనం కోసం ఐదవ అంతస్తులోని మెస్‌కి వెళ్ళాము. అకస్మాత్తుగా, మాకు పెద్ద శబ్దం వినిపించింది. వెంటనే, దట్టమైన పొగ మమ్మల్ని చుట్టుముట్టడంతో భయంతో మేము కిందకు పరిగెత్తాము” అని అతను చెప్పాడు.

అత్యంత కలవరంతో నడిచిన దృశ్యాలను వివరిస్తూ… “ఆ తీవ్ర పరిస్థితుల్లో 1వ అంతస్తు వరకు వచ్చి అక్కడి నుంచి దూకి నా ప్రాణాలను కాపాడుకున్నాను. నాతో పాటు 20 నుండి 30 మంది విద్యార్థులు ఉన్నారు. మేమంతా బయటకు వచ్చాకే విమానం కూలిపోయిన విషయం తెలిసింది” అని విద్యార్థి చెప్పాడు.

ఈ సంఘటనలో విద్యార్థులు చూపిన సమయస్ఫూర్తి, ధైర్యం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Read More : అహ్మదాబాద్ విమాన ప్రమాదం : బ్లాక్ బాక్స్‌ స్వాధీనం.

One thought on “మెడికల్ కాలేజ్ విద్యార్థి తృటిలో ప్రాణాలతో బయటపడ్డ కథ.

Comments are closed.