ఢిల్లీ షాబాద్ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.

ఢిల్లీలోని షాబాద్ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు అంటుకొని భారీగా పొగలు వ్యాపించాయి. దీంతో స్థానికులు భయంతో బయటకు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అపార్ట్‌మెంట్‌లో దట్టమైన పొగలు వ్యాపించడంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు.

ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధికారులు అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేయించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

ఈ ఘటనతో అపార్ట్‌మెంట్ పరిసర ప్రాంతాల్లో గందరగోళ వాతావరణం ఏర్పడింది.

Read More : హనీమూన్ హత్య కేసులో రాజ్ కుష్వాహా అమాయకుడు?