బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్!

IT minister

తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు బీజేపీపై వ్యంగ్య విమర్శలు చేశారు. త్వరలోనే బీజేపీకి మరో గిఫ్ట్ ఇస్తామని వ్యాఖ్యానించారు. గతంలో కూడా తమ ప్రభుత్వం బీజేపీకి ఎన్నో గిఫ్టులు ఇచ్చిందని, ఇప్పుడు మరోసారి similar గిఫ్ట్ ఇవ్వబోతున్నామని ఎద్దేవా చేశారు.

బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ రంజాన్ గిఫ్ట్‌లపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన శ్రీధర్ బాబు, “బీజేపీ, బీఆర్ఎస్ కలిసి రంజాన్ గిఫ్ట్ ఇచ్చారా? మేం కూడా త్వరలో బీజేపీకి మరో గిఫ్ట్ ఇస్తాం” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

అలాగే, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటర్ల తీర్పును గౌరవిస్తున్నామని, కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అయితే, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ – బీజేపీ మధ్య చీకటి ఒప్పందం స్పష్టమైందని ఆరోపించారు. “బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య ఫెవికాల్ బంధం గట్టిగా చేసేందుకు జరిగిన కృషిని అందరూ చూశారు. బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదు? రవీందర్ సింగ్‌కు వచ్చిన ఓట్లు ఎంత? బీఆర్ఎస్ పూర్తిగా బీజేపీకి సహకరించింది” అని ఆయన విమర్శలు చేశారు.

కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకు బీజేపీ – బీఆర్ఎస్ కుదుర్చుకున్న చీకటి ఒప్పందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని శ్రీధర్ బాబు అన్నారు.

Read More