పెంపుడు కుక్క గుండెపోటుతో మృతి

మంత్రి కొండా సురేఖకు తీవ్ర విషాదం

తెలంగాణ మంత్రి కొండా సురేఖ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమె పెంపుడు కుక్క ‘హ్యాపీ’ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందింది. హ్యాపీ మృతితో మంత్రి సురేఖ భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటిపర్యంతమైన ఆమె, కుటుంబ సభ్యులు హ్యాపీకి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

https://twitter.com/TheNaveena/status/1897546081837208001

గత కొన్నేళ్లుగా హ్యాపీతో మధురమైన అనుభూతులను మంత్రి సురేఖ, కుటుంబ సభ్యులు, సిబ్బంది పంచుకున్నారు.2021లో కూడా మరో పెంపుడు కుక్క మృతి చెందడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రస్తుతం హ్యాపీ మృతికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Read More