విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో గురువారం దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తదితర ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించే వ్యక్తి అని, అయితే ఆయన పుస్తకం రాస్తారని మాత్రం అనుకోలేదని అన్నారు. “వెంకటేశ్వరరావులో ఇంత డెప్త్ ఉందని నాకు తెలియదు. మా కుటుంబంలో ఆయన విశిష్టమైన వ్యక్తి. ఎన్టీఆర్ దగ్గర ఇద్దరం కలిసి చాలా విషయాలు నేర్చుకున్నాం. ఆయన అప్పజెప్పిన బాధ్యతలను నెరవేర్చేందుకు కష్టపడ్డాం. గత 40 ఏళ్లుగా కలిసి ఉన్నాం. కానీ ఆయన రచనా వ్యాసంగంలో ఇంత ప్రవేశం ఉందని ఊహించలేదు” అని చంద్రబాబు అన్నారు.
పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, పురందేశ్వరి కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకంపై ప్రశంసలు కురిపించారు. ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకం విద్యార్థులకు, చరిత్ర ప్రేమికులకు మేలైన మార్గదర్శకమవుతుందని తెలిపారు.

2 thoughts on “దగ్గుబాటి వెంకటేశ్వరరావు ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకం ఆవిష్కరణ – సీఎం చంద్రబాబు ముఖ్య వ్యాఖ్యలు”
Comments are closed.