తెలంగాణలో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ స్కూల్స్‌లో తెలుగు తప్పనిసరి

CBSE, ICSE, IB schools in Telangana

తెలంగాణలో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ స్కూల్స్‌లో తెలుగు బోధన తప్పనిసరి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీతో పాటు ఇతర బోర్డులకు అనుబంధమైన స్కూల్స్‌లో తెలుగు బోధనను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26) నుంచి తొమ్మిదో తరగతిలో “సింగిడి” అనే పుస్తకాన్ని రద్దు చేసి, దాని స్థానంలో “వెన్నెల (సింపుల్ తెలుగు)” అనే పుస్తకాన్ని కోడ్ (089)తో అమలు చేయనున్నట్లు ప్రకటించింది. పదో తరగతికి ఈ విధానం 2026-27 విద్యా సంవత్సరంలో అమలులోకి రానుంది.

ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం అధికారిక అనుమతి ఇచ్చింది. విద్యాశాఖ డైరెక్టర్ తెలంగాణ, హైదరాబాద్‌కు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా సంతకం చేశారు.

Read More

One thought on “తెలంగాణలో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ స్కూల్స్‌లో తెలుగు తప్పనిసరి

Comments are closed.