పహాల్గాం దాడి తర్వాత విశ్వరూపం 3 వార్తలు వైరల్!

Vishwaroopam 3 Kamal Haasan update

పహాల్గాంలో ఉగ్ర మూకలు సృష్టించిన నరమేధానికి భారత్ కఠిన ప్రతిచర్యలకు సిద్ధమవుతోంది. మోడీ, అమిత్ షా ఘాటు హెచ్చరికలు జారీ చేయడంతో పాకిస్తాన్ టెన్షన్‌లోకి వెళ్లింది. ఈ క్రమంలో ‘విశ్వరూపం 3’ కాన్సెప్ట్ కూడా తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.

ఉగ్రవాదంపై ఆధారంగా రూపొందిన కమల్ హాసన్ ‘విశ్వరూపం’ మొదటి భాగం విజయవంతమవగా, రెండో భాగం అంతగా ఆకట్టుకోలేకపోయింది. మొదటి భాగంలో ఉగ్రవాద సంస్థల పనిచేసే విధానం, మతం ఆధారంగా భయంకర చర్యలు ఎలా జరుగుతాయన్నదాన్ని స్పష్టంగా చూపించారు.

రెండవ భాగం హిట్ అయితే మూడవ భాగం తెరకెక్కిస్తామని అప్పుడే ప్రచారమయ్యింది. కానీ ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కమల్ హాసన్ ‘విశ్వరూపం’ సిరీస్‌కు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. అప్పట్లో ఈ ప్రాజెక్టును ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా పరిగణించారు.

ఇప్పుడు కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, కమల్ హాసన్ ‘విశ్వరూపం 3’పై మళ్లీ ఆలోచన చేస్తున్నారట. స్వీయ దర్శకత్వంలో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించే ప్లాన్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. పహాల్గాం ఘటన నేపథ్యంలో ఈ వార్త నెట్టింట్లో హాట్ టాపిక్ అయింది.

Read More


One thought on “పహాల్గాం దాడి తర్వాత విశ్వరూపం 3 వార్తలు వైరల్!

Comments are closed.