పులివెందుల సమస్యలపై సీఎం అపాయింట్‌మెంట్ ఇప్పించేందుకు సిద్ధం: బీటెక్ రవి
పులివెందుల నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం జగన్ సీఎం వద్దకు రావాలనుకుంటే, ఆయనకు అపాయింట్‌మెంట్ ఇప్పించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉంటారని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి వ్యాఖ్యానించారు. గురువారం వేంపల్లెలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా కళ్ల జోళ్లు పంపిణీ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘ఎన్నో ఏళ్లుగా ఓట్లు వేసి గెలిపించిన పులివెందుల ప్రజల సమస్యలను జగన్ పూర్తిగా విస్మరించారు. అక్కడ అభివృద్ధి కంట పడడం లేదు. పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ప్రజల కోసం పని చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ, అసెంబ్లీకి కూడా హాజరుకాకపోవడం వల్ల ఉప ఎన్నిక రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉప ఎన్నిక జరిగినా, మళ్లీ జగన్ గెలిచినా అసెంబ్లీకి వెళ్లే అవకాశమే లేదు’’ అని బీటెక్ రవి అన్నారు.

One thought on “పులివెందుల సమస్యలపై సీఎం అపాయింట్‌మెంట్ ఇప్పించేందుకు సిద్ధం”
Comments are closed.