లాస్ ఏంజెల్స్‌లో పోలీసుల కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి మృతి.(video)

లాస్ ఏంజెల్స్‌లో విషాదం చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని ఫిగెరోవా స్ట్రీట్–ఒలింపిక్ బౌలేవార్డ్ కూడలిలో భారత సంతతికి చెందిన గుర్‌ప్రీత్ సింగ్ (36) పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. వివరాల ప్రకారం, గుర్‌ప్రీత్ సింగ్ తన కారును ఆపి, చేతిలో మచెట్ పట్టుకుని వాహనదారులను బెదిరించడం ప్రారంభించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే గుర్‌ప్రీత్ ఆగ్రహంగా ప్రవర్తించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. గాయాలపాలైన అతడిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More : నేతాజీ అస్థికలు స్వదేశానికి తేవాలని అనితా బోస్ విజ్ఞప్తి.

One thought on “లాస్ ఏంజెల్స్‌లో పోలీసుల కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి మృతి.(video)

Comments are closed.