విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం నగరంలో కొత్తగా ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ బస్సులను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి స్వయంగా అందులో ప్రయాణించారు. ఆయనతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు కూడా కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బస్సులోని సౌకర్యాలను పరిశీలించారు. ఈ బస్సులు నగర పర్యాటకానికి కొత్త ఊపునిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Read More : వివేకా హత్యపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.