ఆఫ్ఘానిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – 71 మంది దుర్మరణం

ఆఫ్ఘానిస్థాన్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో బస్సు, ట్రక్కు, మోటార్‌సైకిల్ ఢీకొనడంతో భయంకరమైన అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది చిన్నారులతో సహా మొత్తం 71 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సు పూర్తిగా మంటల్లో కాలి పోవడంతో ప్రయాణికులు సజీవ దహనమయ్యారని అధికారులు ధ్రువీకరించారు. ప్రావిన్షియల్ ప్రభుత్వ ప్రతినిధి అహ్మదుల్లా ముత్తఖీ ఈ ఘటనపై స్పందిస్తూ, ఇటీవలి కాలంలో దేశంలో జరిగిన అత్యంత ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఇదొక్కటని తెలిపారు. ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోల్లో బస్సు మంటల్లో కాలిపోవడం, స్థానికులు భయాందోళనలకు గురైన దృశ్యాలు కనిపిస్తున్నాయి.

అధికారుల ప్రకారం, ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణిస్తున్న వారు ఇరాన్ నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్న ఆఫ్ఘన్ వలసదారులే. హెరాత్‌లోని ఇస్లాం ఖాలా సరిహద్దు వద్ద బస్సు ఎక్కిన వారు రాజధాని కాబూల్ వైపు బయలుదేరగా ఈ ఘోరం సంభవించింది. స్వదేశానికి చేరుకునే క్షణాల్లోనే ఇలా ప్రాణాలు కోల్పోవడం ఆఫ్ఘాన్ ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Read More : భారత్-చైనా సంబంధాలు కొత్త దశలోకి.

One thought on “ఆఫ్ఘానిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – 71 మంది దుర్మరణం

Comments are closed.