ఏపీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నేడు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ హబ్‌ను ఉదయం 11:30 గంటలకు వర్చువల్‌గా ప్రారంభించారు.

ఈ ఇన్నోవేషన్ హబ్ స్టార్టప్ కంపెనీలకు మౌలిక సదుపాయాలు, ఆర్థిక పరమైన వనరుల సహకారాన్ని అందిస్తుంది. తద్వారా రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలు కొత్త ఆవిష్కరణలు, వ్యాపారాలు స్థాపించడానికి ప్రోత్సాహం లభిస్తుంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ఉపాధి అవకాశాల కల్పనకు ఈ హబ్ ఒక కీలకమైన వేదికగా నిలుస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Read More : తిరుమలలో ఏటీఎం చోరీకి యత్నం

One thought on “ఏపీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం

Comments are closed.