సుప్రీంకోర్టులో బెయిల్ రద్దుపై వాదనలు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దు అంశంపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. జస్టిస్‌ ఎం.ఎం. సుందరేశ్‌, జస్టిస్‌ ఎన్‌.కె. సింగ్‌ల ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది.

కడప ఎంపీ అవినాష్‌ బెయిల్‌ను రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు విధించిన గడువుతోనే సీబీఐ దర్యాప్తును ముగించిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇంకా ఈ హత్య కేసులో లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

Read More : సీఎం కార్యక్రమాల సమన్వయకర్తగా పాందువ్వ శ్రీను నియామకం