DCM : జహీరాబాద్‌లో ఫిర్యాదు

జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో ముస్లిం యువకులు ఫిర్యాదు చేశారు. ముస్లింలు ఉగ్రవాదులు అన్నట్టుగా పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి దారితీశాయని వారు తెలిపారు.

మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఖాజా నేతృత్వంలో ముస్లిం సముదాయ ప్రతినిధులు పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ “వందశాతం ముస్లింలు ఉగ్రవాదులే” అనే విధంగా ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు.

మత చిహ్నాలైన టోపీలు, గడ్డాలు, కుర్తాలు, స్కార్ఫ్‌లను ఉగ్రవాదానికి చిహ్నాలుగా ప్రజల ముందు ప్రదర్శించడం ద్వారా ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

పవన్ వ్యాఖ్యలు సామాజిక సౌహార్దాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఇటువంటి మాటలు ప్రజల్లో చిచ్చు పెట్టే ప్రమాదం ఉన్నదని ముస్లిం నాయకులు హెచ్చరించారు.

Read More : సింహాచలం దుర్ఘటనపై YSRCP స్పందన.