మాలీవుడ్ బ్యూటీ, యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా తెలుగు సినిమా ‘పరదా’ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘సినిమా బండి’ ఫేం ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ నటి దర్శన, సంగీత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీధర్ మక్కువ, విజయ్ డొంకాడ నిర్మించారు. ప్రత్యేక కాన్సెప్ట్‌తో రూపొందిన ‘పరదా’ ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉందని సెన్సార్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో మేకర్స్ కూడా సినిమాపై పూర్తి నమ్మకంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.
ఇక హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కెరీర్‌లో బెస్ట్ మూవీ ఇదేనని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె ప్రకటించారు. మొదటి రోజు నుంచి తనకు సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆగస్టు 22న విడుదల కానున్న ఈ సినిమాను తప్పక థియేటర్లలో చూడాలని కోరారు.
అదే సమయంలో, “రివ్యూలు బాగుంటే మీ ఫ్రెండ్స్‌కి సజెస్ట్ చేయండి. రివ్యూలు నెగటివ్‌గా ఉంటే సినిమాను పక్కన పెట్టేయండి” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక చర్చకు దారితీశాయి. చిన్న సినిమాలకు మొదటి రోజు సమీక్షలు ఎంత ముఖ్యమో ఆమె స్పష్టంగా చెప్పినట్లు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇప్పుడు అందరి దృష్టి ‘పరదా’పై పడింది. అనుపమ కాన్ఫిడెంట్‌గా చెప్పినట్లే ఈ సినిమా ఆమెకు పెద్ద హిట్ అవుతుందో లేదో చూడాలి.
Read More : పవన్ కళ్యాణ్ సినిమా ప్రమోషన్‌పై హైకోర్టులో పిటిషన్

One thought on “పరదా సినిమాపై అనుపమ నమ్మకం వైరల్”
Comments are closed.