సీఎం కార్యక్రమాల సమన్వయకర్తగా పాందువ్వ శ్రీను నియామకం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమాల సమన్వయకర్తగా మంతెన వెంకట సత్యనారాయణ రాజు (పాందువ్వ శ్రీను) నియమితులయ్యారు. ఆయనకు సహాయ మంత్రి హోదా కల్పించబడుతుందని ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలుగుదేశం పార్టీలో నమ్మకమైన కార్యకర్తగా, చంద్రబాబు మరియు మంత్రి నారా లోకేశ్‌కు సన్నిహితుడిగా పాందువ్వ శ్రీనుకు గుర్తింపు ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యక్రమాల పర్యవేక్షణలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నియామకానికి ముందు ఆయన సోమవారం ముఖ్యమంత్రిని కలిసి, గతంలో తనకు అప్పగించిన పార్టీ పనులను సమర్థవంతంగా పూర్తి చేసిన విషయాన్ని వివరించారు. దీనికి స్పందించిన చంద్రబాబు ఆయనను అభినందించారు.

పాందువ్వ శ్రీను నియామకంతో ఉండి నియోజకవర్గంతో పాటు ఆయన స్వగ్రామం పాందువ్వలో పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు ఈ నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకున్నారు.

Read More : పవన్ కళ్యాణ్ సినిమా ప్రమోషన్‌పై హైకోర్టులో పిటిషన్