కూకట్‌పల్లిలో 12ఏళ్ల బాలిక దారుణ హత్య

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 ఏళ్ల బాలికను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

వివరాల్లోకి వెళ్తే…
ఒక యువకుడు బాలికపై లైంగిక దాడి యత్నం చేశాడు. అయితే బాలిక ధైర్యంగా ఎదుర్కొనడంతో, ఆగ్రహానికి గురైన అతడు కత్తితో పొడిచి ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

ప్రాథమిక విచారణలో, బాలిక ఇంట్లో ఒంటరిగా ఉందని తెలిసి ఆ యువకుడు అక్కడికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ యువకుడు కుటుంబానికి దగ్గరి బంధువని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి, అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

Read More : ఓబుళాపురం కేసులో సబితాకు హైకోర్టు నోటీసులు

One thought on “కూకట్‌పల్లిలో 12ఏళ్ల బాలిక దారుణ హత్య

Comments are closed.