రక్షాబంధన్ శుభాకాంక్షల్లో ఎమ్మెల్యే రాజాసింగ్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రక్షాబంధన్ సందర్భంగా సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పండుగను పురస్కరించుకుని ఆయన ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.

“రక్షాబంధన్ పండుగ రోజున సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి, అతని దీర్ఘాయుష్షును కోరుకుంటుంది. సోదరుడు తన సోదరిని జీవితాంతం రక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు” అని రాజాసింగ్ పేర్కొన్నారు.

అయితే, ఈ రక్షాబంధన్‌ నాడు తన సోదరీమణుల నుంచి ఒక ప్రత్యేక బహుమతి కావాలని ఆయన కోరారు. “సోదరీమణులారా, లవ్ జిహాద్ లాంటి కుట్రలకు మీరు బలైపోరని ప్రతిజ్ఞ చేయండి” అని ఆయన పిలుపునిచ్చారు. లవ్ జిహాద్ పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని రాజాసింగ్ తన సందేశంలో హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

Read More : ‘స్వచ్ఛ తెలంగాణ’లో భాగస్వామి: సినీనటుడు సునీల్

One thought on “రక్షాబంధన్ శుభాకాంక్షల్లో ఎమ్మెల్యే రాజాసింగ్

Comments are closed.