హైదరాబాద్: నగరంలోని మెట్రో రైలు సేవలు రికార్డు సృష్టించాయి. నిన్న ఒక్కరోజే ఏకంగా 5.36 లక్షల మంది ప్రయాణించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఇది మెట్రో చరిత్రలోనే అత్యధిక సంఖ్యగా నమోదైంది.
సాధారణంగా హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య 4.7 లక్షల నుంచి 4.9 లక్షల మధ్య ఉంటుంది. గతంలో కొన్ని సందర్భాల్లో 5 లక్షల మార్కును దాటినప్పటికీ, తాజా సంఖ్య అత్యధికం. సెలవులు, ప్రత్యేక సందర్భాల్లో మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. మెట్రోపై పెరుగుతున్న నమ్మకానికి, ప్రజా రవాణా వ్యవస్థ ప్రాధాన్యతకు ఈ గణాంకాలు నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు.
Read More : రక్షాబంధన్ శుభాకాంక్షల్లో ఎమ్మెల్యే రాజాసింగ్

One thought on “హైదరాబాద్ మెట్రోలో రికార్డు”
Comments are closed.