గాజా ఆక్రమణ కాదంటున్న నెతన్యాహు

గాజాపై పూర్తిగా ఆధిపత్యం సాధించే ప్రతిపాదనకు ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై దేశీయంగా, అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తమ అసలు ప్రణాళికపై స్పష్టతనిచ్చారు.

ఎక్స్‌ వేదికగా స్పందించిన నెతన్యాహు… “మేము గాజాను ఆక్రమించుకోవడం కాదు, హమాస్ నియంత్రణ నుంచి విముక్తి కల్పించడమే మా లక్ష్యం. గాజాలో మళ్లీ సైనిక దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటాం. అక్కడ శాంతియుత పరిపాలనను ఏర్పాటు చేయడంలో మేము కట్టుబడి ఉన్నాం. పాలస్తీనా అథారిటీ, హమాస్ లేదా ఏ ఇతర ఉగ్రవాద సంస్థ కూడా ఆ ప్రాంతంలో ఉండదు. ఈ చర్య గాజాలో హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించేందుకు, భవిష్యత్తులో గాజా నుంచి ఇజ్రాయెల్‌పై ఎలాంటి ముప్పు లేకుండా చేసేందుకు దోహదపడుతుంది” అని తెలిపారు.

Read More : మోదీ-ట్రంప్ సంబంధాలపై నెతన్యాహు సలహాలు,

One thought on “గాజా ఆక్రమణ కాదంటున్న నెతన్యాహు

Comments are closed.