గోవా గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన అశోక్ గజపతిరాజు తొలిసారి ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి భవన్కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసారు.
తరువాత పార్లమెంటుకు వెళ్లిన గజపతిరాజు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రామ్మోహన్ నాయుడుతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటు వద్ద టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు గజపతిరాజుకు స్వాగతం పలికారు.

Read More : రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

One thought on “గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఢిల్లీలో పర్యటన”
Comments are closed.