అభిమానాన్ని నిజం చేసుకున్న అరుదైన అవకాశం

మేఘాలయకు చెందిన మహిళా చెఫ్ నంబీ మారక్ తన కలను నిజం చేసుకున్న అరుదైన సందర్భం ఇది. చిన్ననాటి నుండి గోడలపై సచిన్ టెండూల్కర్ పోస్టర్లను చూస్తూ పెరిగిన నంబీకి, తన అభిమాన క్రికెట్ దిగ్గజానికి వంట వడ్డించే అవకాశం రావడం గర్వకారణంగా మారింది.

సచిన్ టెండూల్కర్ ఇటీవల మేఘాలయ పర్యటనలో భాగంగా షిల్లాంగ్‌కు విచ్చేసిన సందర్భంగా, నంబీ మారక్ తమ గారో సంప్రదాయ వంటకాలతో అతిధ్యాన్ని అందించారు. ఆమె ఎంతో శ్రద్ధతో తయారు చేసిన వెజ్, నాన్ వెజ్ వంటకాలు సచిన్‌కి బాగా నచ్చాయని తెలిపారు.

ప్రత్యేకంగా ఆమె వండిన గుమ్మడికాయ చికెన్ కర్రీ టెండూల్కర్‌ను ప్రత్యేకంగా ఆకట్టుకుందని నంబీ వెల్లడించారు. తన అభిమాన క్రికెట్ హీరోకు స్వయంగా వండి వడ్డించడం తన జీవితంలో మరిచిపోలేని క్షణంగా చెబుతూ – ఇది ట్రోఫీ గెలిచిన ఆనందాన్ని మించిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

నంబీ మారక్‌ ఈ సంఘటనను తన వృత్తిపరమైన ప్రయాణంలో ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు.

Read More : ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.