సుఖ్‌బీర్ బాదల్: మతపెద్దల శిక్ష.. గోల్డెన్ టెంపుల్ వద్ద సేవాదార్ డ్యూటీ చేసిన సుఖ్‌బీర్ బాదల్
2007 నుండి 2017 మధ్య అకాలీ దళ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పుల శిక్షగా సిక్కు మత పెద్దలు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు మతపరమైన శిక్ష విధించారు. ఈ మేరకు, మంగళవారం ఆయన తన సహచరులతో కలిసి అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ వద్ద సేవాదార్ (sewadar) డ్యూటీని నిర్వహించారు.
శిరోమణి అకాలీ దళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ స్వర్ణ దేవాలయం వద్ద బట్టలు ఉతికి, పాత్రలను శుభ్రం చేస్తూ మతపరమైన శిక్షను అనుభవించారు. ఆయన మెడలో తంఖా (మతపరమైన శిక్ష) ఫలకాన్ని వేసుకుని ఈ పనులను చేశారు. 2007 నుంచి 2017 మధ్య శిరోమణి అకాలీ దళ్ ప్రభుత్వం జరిగిన తప్పుల శిక్షగా ఈ మతపరమైన శిక్షను సిక్కు మత పెద్దలు విధించారు.
సిక్కు మతాచారం ప్రకారం శ్రీ అకాల్ తక్త్ సాహిబ్ కింద ఈ శిక్షను ఖరారు చేశారు. సుఖ్‌బీర్ ను మతపరమైన ఉల్లంఘనలకు పాల్పడినట్లు సిక్కు పెద్దలు ఇటీవల నిర్ణయించారు. ఈ శిక్షను అనుభవించేందుకు సుమారు మూడు నెలల తర్వాత బాదల్ ముందుకు వచ్చారు. కాలుకు గాయం కావడంతో వీల్ చైర్‌లో కూర్చొని ఆయన ఈ సేవలు పూర్తి చేశారు. పాత్రలను శుభ్రం చేసేవారిగా కూడా పనిచేశారు.
సుఖ్‌బీర్ బాదల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “సేవ చేయాలని దేవుడు నాకు ఆదేశం ఇచ్చారు. ఆయన ఆదేశాన్ని శిరసావహిస్తా. అకాల్ తక్త్‌లో భాగంగా ఇది జరిగింది. గేటు వద్ద కూర్చొంటాను. లంగర్‌లో కూడా సేవ చేస్తాను” అని చెప్పారు.
ఇక, అకాలీ నాయకులు అయిన సుచా సింగ్, హిరా సింగ్, బల్వీందర్ సింగ్, దల్జీత్ సింగ్, గుల్జార్ సింగ్‌కి కూడా మతపెద్దలు శిక్షలు విధించారు. వారంతా స్వర్ణ దేవాలయంలోని బాత్రూమ్‌లను శుభ్రం చేసి, అనంతరం టెంపుల్ కిచెన్‌లో పాత్రలను శుభ్రం చేయాలని ఆదేశించారు.
