కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్‌కు ఢిల్లీలోని చాణక్యపూరి ప్రాంతంలో చైన్ స్నాచింగ్ ఘటనలో చేదు అనుభవం ఎదురైంది. సోమవారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆమె మెడలో నుండి గొలుసు లాక్కొని దుండగులు పారిపోయారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఎంపీ సుధా రామకృష్ణన్, వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ లేఖలో, ఢిల్లీలో పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆమె లేఖలో డిమాండ్ చేశారు.
ఎంపీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాజధాని నగరంలో కూడా ప్రజాప్రతినిధులకు భద్రత లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read More : ఝార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత

One thought on “ఢిల్లీలో ఎంపీ సుధా రామకృష్ణన్‌కు చేదు అనుభవం”
Comments are closed.