తిరుపతి నగరంలోని గాంధీ రోడ్డులో ఉన్న ఏపీకో (APCO) షోరూమ్‌లో అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు షాపులో నుంచి ₹43 వేల నగదు, ఒక క్యాష్ బాక్స్‌ను దొంగిలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అర్ధరాత్రి కారులో వచ్చిన దొంగలు, తమను ఎవరూ చూడకుండా గొడుగు అడ్డంపెట్టుకుని షోరూమ్ తాళాలను కట్టర్‌తో పగలగొట్టారు. అనంతరం షాపు లోపలికి ప్రవేశించి, క్యాష్ కౌంటర్ లో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. ఈ చోరీ దృశ్యాలు మొత్తం షోరూమ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.
ఉదయం చోరీ విషయం గమనించిన షాపు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెస్ట్ ఎస్సై అనిల్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
Read More : గాలి భాను ప్రకాశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

One thought on “తిరుపతి ఏపీకో షోరూమ్‌లో చోరీ”
Comments are closed.