నటి కల్పికకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్, జూలై 31: నటి కల్పికకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆమెపై నమోదైన రెండు కేసులలో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అరెస్టు చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

వివరాల్లోకి వెళ్తే… గతంలో ప్రిజం పబ్‌లో జరిగిన గొడవకు సంబంధించి పబ్ సిబ్బంది ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కల్పికపై ఒక కేసు నమోదైంది. అదనంగా, సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ ఆమెపై సైబర్ క్రైమ్ పోలీసులకు మరో ఫిర్యాదు అందింది, దీనిపై కూడా కేసు నమోదైంది.

ఈ రెండు కేసులలో తనను అరెస్టు చేయకుండా స్టే ఇవ్వాలని కోరుతూ కల్పిక హైకోర్టును ఆశ్రయించారు. ఆమె వినతిని పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం, ప్రస్తుతానికి ఆమెను అరెస్టు చేయకుండా ఉండాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనితో కల్పికకు తాత్కాలిక ఊరట లభించినట్లైంది.

Read More : క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై స్పందించిన విజయ్ సేతుపతి