“మాకు అభ్యంతరం లేదు, కానీ వారి ఆర్థిక వ్యవస్థకు నష్టమే”

భారత్‌తో రష్యా ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అయితే, అటువంటి ఒప్పందాలు ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలను మరింత దిగజార్చుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ వేదికగా భారత్-రష్యా వాణిజ్య సంబంధాలపై ట్రంప్ మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

భారత్ అత్యధిక సుంకాలు విధిస్తోందని, అందువల్లే న్యూఢిల్లీతో అమెరికా చాలా తక్కువ వ్యాపారం చేస్తోందని ట్రంప్ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం రష్యా, అమెరికా మధ్య ఎలాంటి వాణిజ్య సంబంధాలు లేవని ఆయన తేల్చి చెప్పారు.

కాగా, గతంలో భారత్ దిగుమతులపై 25 శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి భారత్ భారీగా చమురును కొనుగోలు చేయడమే ఇందుకు కారణమని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్‌పై కూడా ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. “తమతో వాషింగ్టన్ గేమ్ ఆడుతోందని దిమిత్రి అంటున్నాడు. బహుశా తనే ఇంకా అధ్యక్షుడిగా ఉన్నానని భావిస్తున్నాడేమో” అని ట్రంప్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

One thought on ““మాకు అభ్యంతరం లేదు, కానీ వారి ఆర్థిక వ్యవస్థకు నష్టమే”

Comments are closed.