గిరిజన సంక్షేమానికి కేటాయించిన నిధులు సరైన విధంగా వినియోగించాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించిందని విమర్శించారు. ఆదివాసి ప్రాంతాలకు రోడ్లు, వంతెనలు అత్యవసరమని, కానీ నిధులు సక్రమంగా వినియోగించకపోవడంతో గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈరోజు (సోమవారం) హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ మంత్రి సీతక్క, ఎస్టీల కోసం కేటాయించిన నిధులను ఇతర ప్రాంతాలకు తరలించకుండా అదే జిల్లాలో వినియోగించాలని సూచించారు. సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తే ఏజెన్సీ ప్రాంతాలు మరింత వెనకబాటుకు గురవుతాయని హెచ్చరించారు.
ఎస్టీల గృహనిర్మాణానికి బడ్జెట్ పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కనీస స్థల అర్హతను సడలించే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని మంత్రి తెలిపారు.
Read More : బాలాపూర్లో భారీ అగ్నిప్రమాదం – ప్లాస్టిక్ కంపెనీ దగ్ధం
