పార్లమెంట్‌లో ఆపరేషన్ సిందూర్ చర్చ

పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై పార్లమెంట్‌లో చర్చ ప్రారంభమైంది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్‌పై ప్రతిపక్షాల డిమాండ్ మేరకు చర్చ జరగనుంది.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ చర్చను ప్రారంభిస్తూ ఆపరేషన్‌కు సంబంధించిన కీలక వివరాలను వెల్లడిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కావాల్సిన చర్చ, బీహార్‌లో ఓటర్ల సమగ్ర సవరణ సర్వేపై విపక్షాల ఆందోళన కారణంగా పలు మార్లు వాయిదా పడింది. చివరకు మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌సభ ప్రారంభమైంది.

Read More : జమ్మూకాశ్మీర్ దాచిగామ్‌లో మహదేవ్ ఆపరేషన్ కొనసాగింపు