ఆంధ్రప్రదేశ్‌ను రక్షణ హబ్‌గా తీర్చిదిద్దాలని టీడీపీ వినతి

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో రక్షణ, ఏరోస్పేస్ పరికరాల తయారీలో అగ్రగామిగా తీర్చిదిద్దాలని కోరుతూ టీడీపీ ఎంపీల బృందం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను వినతిపత్రం అందించింది. రాష్ట్రంలో రక్షణ, అంతరిక్ష పరిశ్రమల మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రతిపాదనలపై చర్చించేందుకు శుక్రవారం ఢిల్లీలో ఆయనతో సమావేశమైంది.

ఈ బృందంలో టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీలు దగ్గుమళ్ల ప్రసాదరావు, మాగుంట శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల విస్తరణకు కేంద్రం సహకారం అందించాలంటూ వారు రక్షణ మంత్రిని కోరారు.

Read More : కుప్పంలో 250 కుటుంబాలకు దత్తత – సీఎం

2 thoughts on “ఆంధ్రప్రదేశ్‌ను రక్షణ హబ్‌గా తీర్చిదిద్దాలని టీడీపీ వినతి

Comments are closed.