ఇటలీలో విమాన ప్రమాదం!

ఇటలీలో విషాదం చోటుచేసుకుంది. బ్రెస్సియా నగరంలోని హైవేపై ఓ చిన్న ప్రయివేటు విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న అత్యవసర సేవల సిబ్బంది శకలాలను తొలగించి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Read More : భారత్–బ్రిటన్ వాణిజ్య ఒప్పందం ?