టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా కొత్త రంగంలోకి అడుగుపెట్టింది. సినిమాల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్.. ఇప్పుడు వ్యాపార రంగం వైపూ దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించిన సంకేతాలను ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తాజాగా షేర్ చేసిన వీడియోలో రష్మిక – “నేను దీన్ని రికార్డ్ చేస్తున్నానని నాకే నమ్మకం రావడం లేదు. నా హృదయానికి ఎంతో దగ్గరగా ఉన్న విషయంపై చాలా రోజులుగా పని చేస్తున్నా. మీరు దానిని అనుభవిస్తారని, ఇష్టపడతారని ఆశిస్తున్నాను. త్వరలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా ఉత్సాహంగా, కొంత ఆందోళనగా కూడా ఉంది” అని పేర్కొంది.
ఈ వీడియో తర్వాత రష్మిక తల్లితో మాట్లాడిన మరో క్లిప్‌ను పోస్ట్ చేసింది. అందులో ఆమె – “నేను ఇప్పుడు చాలా ముఖ్యమైన షూట్‌కి వెళ్తున్నా. మీరు చెప్పిన బిజినెస్‌ను మొదలు పెడతా” అని చెప్పగా, ఆమె తల్లి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ మద్దతు తెలిపింది. అయితే, రష్మిక ఏ వ్యాపారం ప్రారంభించనుందన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, రష్మిక బిజినెస్ రంగ ప్రవేశంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అనేక స్టార్ హీరోయిన్లు తమ ఫ్యాషన్ బ్రాండ్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రష్మిక కూడా అదే దారిలో నడుస్తుందన్న అంచనాలు వెలువెడుతున్నాయి.
ఫిలింస్ తో పాటు ఇప్పుడు వ్యాపార రంగాన్ని కూడా సమర్థంగా సమన్వయం చేయనున్న రష్మికకు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Read More : బెటింగ్ యాప్ కేసు – టాలీవుడ్ ప్రముఖులకు సమన్లు

One thought on “రష్మిక మందన్న కొత్త అడుగు…?”
Comments are closed.