బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ మరియు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వార్ 2’ విడుదలకు సిద్ధమవుతోంది. యశ్‌రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మించగా, డైరెక్షన్‌ను అయాన్ ముఖర్జీ అందిస్తున్నారు.
ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, మేకర్స్ ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్‌ను జూలై 25న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దాదాపు 2 నిమిషాల 39 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్‌కు సెన్సార్ బోర్డు (CBFC) U/A సర్టిఫికేట్ (16+) జారీ చేసింది. దీంతో ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశముందని చిత్ర బృందం ఆశిస్తోంది.
ఈ సినిమాలో హృతిక్ రోషన్ మళ్లీ కబీర్‌గా కనిపించనున్నాడు. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రంలో ప్రతినాయకుడు పాత్రలో అలరించనున్నాడు. కియారా అద్వానీ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. ఇదే యశ్‌రాజ్ స్పై యూనివర్స్‌లో ఆరో చిత్రం కావడం విశేషం.
Read More : రష్మిక మందన్న కొత్త అడుగు…?

One thought on “‘వార్ 2’ – జూలై ? ట్రైలర్ రిలీజ్”
Comments are closed.