జట్టు రీ-ఎంట్రీ కోసం సర్ఫరాజ్ ఖాన్ కసరత్తు

భారత యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ మళ్లీ జాతీయ జట్టులో స్థానం సంపాదించేందుకు గట్టిగా శ్రమిస్తున్నాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు ఐదు టెస్టుల సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో అతనికి చోటు దక్కలేదు. దీంతో తన ఫిట్‌నెస్‌పై పూర్తిగా దృష్టి సారించి బరువు తగ్గించుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాడు. ఇందులో భాగంగా సర్ఫరాజ్ కేవలం రెండు నెలల్లోనే దాదాపు 17 కిలోల బరువు తగ్గాడు. గతంలో ఆయన బరువు 95 కిలోలు ఉండగా, ప్రస్తుతం అది 78 కిలోలకు చేరిందని తెలుస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు సర్ఫరాజ్ కఠినమైన ఆహార నియమాలు పాటిస్తున్నాడు. ఉడికించిన కూరగాయలు, చికెన్ వంటి తక్కువ కొలెస్ట్రాల్ ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నాడు.

తన శరీరంలో వచ్చిన మార్పులను చూపించేందుకు జిమ్‌లో దిగిన ఫోటోను సర్ఫరాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు ఆయనకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ఇంత సన్నగా మారాడా సర్ఫరాజ్?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫిట్‌నెస్ విషయంలో సీరియస్‌గా ఉన్న ఈ యువ ఆటగాడు త్వరలోనే జట్టులోకి రీ-ఎంట్రీ ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

Read More : వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌కి చేరిన తొలి భారత మహిళ

One thought on “జట్టు రీ-ఎంట్రీ కోసం సర్ఫరాజ్ ఖాన్ కసరత్తు

Comments are closed.