ఏఎం రత్నాన్ని చైర్మన్‌గా సూచించిన పవన్

సినిమా ప్రమోషన్‌లో తనకు అనుభవం లేదని, ఈ ప్రెస్‌మీట్‌కు అసలు కారణం ప్రముఖ నిర్మాత ఏఎం రత్నమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఏఎం రత్నం ప్రాంతీయ సినిమాను పాన్‌ఇండియా స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తిగా ప్రశంసించారు.

తాజాగా పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ, ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఏఎం రత్నంనే తాను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదించానని వెల్లడించారు. కేవలం తన నిర్మాత అన్న కారణం కాదు… ఆయన అన్ని భాషల్లో ప్రముఖ హీరోలతో పని చేసిన అనుభవం కలవారు అని చెప్పారు. పాన్‌ఇండియా స్థాయిలో ఆయనకు ఉన్న పరిచయాలు, విజన్ పరిశ్రమకు ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు.

తన పరిధిలో ఉన్న విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పవన్ తెలిపారు. “ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కి ఆయన వంటి అనుభవజ్ఞుడు వస్తే, టాలీవుడ్ మరింత అభివృద్ధి చెందుతుంది,” అని అభిప్రాయపడ్డారు.

Read More : హరిహర వీరమల్లు ఈవెంట్‌కు పోలీసుల గ్రీన్ సిగ్నల్

One thought on “ఏఎం రత్నాన్ని చైర్మన్‌గా సూచించిన పవన్

Comments are closed.