ఇండోనేసియాలో ఫెర్రీలో మంటలు..

ఇండోనేసియాలో వందల మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఓ ఫెర్రీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన సులవేసి ద్వీపం సమీపంలో చోటు చేసుకుంది. ఫెర్రీలో ఊహించని విధంగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాల పరిరక్షణ కోసం కొంతమంది సముద్రంలోకి దూకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. మృతుల్లో ఓ గర్భిణీ కూడా ఉన్నట్లు గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సహాయ బృందాలు రంగంలోకి దిగి భారీగా సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు 280 మందిని సురక్షితంగా బయటికి తీసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారిని రక్షించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించామని సంబంధిత అధికారులు వెల్లడించారు.

Read More : ఢాకాలో విమాన ప్రమాదం..