ముడా వివాదం: సుప్రీంకోర్టు తిప్పికొట్టింది

సూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూముల అక్రమ కేటాయింపుల కేసులో Enforcement Directorate (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈడీ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. “ఈడీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతోంది. ఇది అధికార దుర్వినియోగానికి తార్కిక ఉదాహరణ,” అని వ్యాఖ్యానించింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వతి, రాష్ట్ర మంత్రి సురేశ్‌కి జారీ చేసిన సమన్లను హైకోర్టు ఇప్పటికే రద్దు చేసిన నేపథ్యంలో ఈడీ వేసిన పిటిషన్‌ను సుప్రీం పరిగణనలోకి తీసుకోవడంపై ఆసక్తి చూపలేదు.

ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదంటూ ధర్మాసనం స్పష్టం చేస్తూ… “ఈడీని రాజకీయ పోరాటాలకు వాడటం ఎందుకు?” అంటూ న్యాయవాదిని ప్రశ్నించింది. చివరికి, ఈడీ పిటిషన్‌ను విచారణకు స్వీకరించకపోవడంతో కేసు ముగిసింది.

Read More : తమిళనాడు సీఎం స్టాలిన్‌కు స్వల్ప అస్వస్థత.. అపోలో వైద్యుల ప్రకటన ?