కొత్త పాస్‌పోర్టు నిబంధనలు: జననం అక్టోబర్ 1, 2023 తర్వాతైతే జన్మ ధృవీకరణపత్రం తప్పనిసరి

పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసే విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం, 2023 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించిన ప్రతి భారతీయ పౌరుడు (citizen) పాస్‌పోర్టు (passport) కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో తప్పనిసరిగా తన జన్మ ధృవీకరణ పత్రాన్ని (birth certificate) సమర్పించాలి. ఇది వ్యక్తి జన్మతేది (date of birth) నిర్ధారించడానికి తప్పనిసరి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇంతకుముందు పాస్‌పోర్టు దరఖాస్తులో వివిధ రకాల పత్రాలను జన్మతేది రుజువుగా అంగీకరించేవారు. కానీ తాజా మార్పులతో, ఇకపై జన్మ ధృవీకరణ పత్రమే ప్రధాన ఆధారంగా పరిగణించనున్నారు. ఈ నిబంధనలు దేశవ్యాప్తంగా అమలులోకి రానుండగా, పాస్‌పోర్టు దరఖాస్తుదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Read More

2 thoughts on “కొత్త పాస్‌పోర్టు నిబంధనలు: జననం అక్టోబర్ 1, 2023 తర్వాతైతే జన్మ ధృవీకరణపత్రం తప్పనిసరి

Comments are closed.