తమిళనాడు సీఎం స్టాలిన్‌కు స్వల్ప అస్వస్థత.. అపోలో వైద్యుల ప్రకటన ?

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురై చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనకు స్వల్పంగా బొబ్బలెక్కినట్లు అనిపించడంతో వెంటనే అపోలోకి తరలించారు. ఆసుపత్రిలో చేర్పించే సమయంలో ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి మరియు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయనిధి స్టాలిన్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. స్టాలిన్ అస్వస్థతపై వార్తలు వెలువడిన వెంటనే డీఎంకే కార్యకర్తలు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే తాజా సమాచారం ప్రకారం స్టాలిన్ ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు.

అపోలో మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రిని పూర్తిగా పరిశీలించాం. ప్రస్తుతం ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య లేదు. కొన్ని రొటిన్ వైద్య పరీక్షలు మాత్రమే జరిపాం. పరిస్థితి నిలకడగా ఉంది” అని తెలిపారు.

స్టాలిన్ ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు అధికార వర్గాలు ప్రకటించడంతో డీఎంకే వర్గాల్లో ఉపశమనం వ్యక్తమవుతోంది.

Read More : ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై మంత్రి రామ్మోహన్ కీలక ప్రకటన

One thought on “తమిళనాడు సీఎం స్టాలిన్‌కు స్వల్ప అస్వస్థత.. అపోలో వైద్యుల ప్రకటన ?

Comments are closed.