హైదరాబాద్: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా భావోద్వేగంగా మాట్లాడారు. “జీవితంలో తొలిసారి నేను నా సినిమా ప్రమోషన్లో పాల్గొంటున్నాను,” అంటూ పవన్ అన్నారు. ఇప్పటి వరకు రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించానని, సినిమాలపై పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేదని చెప్పారు.
“పోలిటికల్‌గా నాకు పేరు ఉంది. దేశవ్యాప్తంగా నాకు గుర్తింపు ఉంది. కానీ సినిమా పరంగా కొందరు హీరోల కంటే నేను తక్కువగా నిలిచాను. కలెక్షన్ల విషయంలో కూడా ఇతరుల కంటే నాకు ఎక్కువ రాలేదు. ఎందుకంటే నా దృష్టి ఎప్పుడూ సినిమాల మీద కాదు.. సమాజం, రాజకీయాల మీదే పెట్టాను,” అంటూ ఆయన అన్నారు. తన కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడుతూ – “నువ్వు చిరంజీవి కొడుకైనా, నా కొడుకైనా సరే.. టాలెంట్ లేకపోతే ఈ ఇండస్ట్రీలో నిలబడలేవు. సినిమా రంగంలో కులాలు, మతాలకు చోటు లేదు. ఇది నిజమైన ప్రతిభకు అవకాశమిచ్చే వేదిక,” అన్నారు పవన్. “పోడియం లేకుండా మాట్లాడటమంటే… నగ్నంగా ఉన్నట్టుంది. మీడియాతో పొలిటికల్ ఇంటరాక్షన్ చేసాను, కానీ సినిమాకు తొలిసారి ఈ విధంగా ప్రమోషన్ చేస్తున్నాను,” అంటూ పవన్ కళ్యాణ్ ముగించారు.
“హరిహర వీరమల్లు సినిమా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది”
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పౌరాణిక చిత్రమైన హరిహర వీరమల్లు గురించి ఆయన ప్రెస్మీట్లో స్పందించారు. ఈ సినిమా పూర్తి చేయడం వెనుక ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. “ఒక సినిమా తీయాలంటే యుద్ధమే చేయాలి. ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు ఎదురయ్యాయి. అయినా కూడా మా ప్రయత్నం ఆగలేదు. నా సినీ జీవితంలో హరిహర వీరమల్లు చాలా ప్రత్యేకమైన చిత్రం” అని పవన్ అన్నారు. ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గురించి మాట్లాడుతూ – “అలాంటి నిర్మాతతో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన సహనంతోనే ఈ సినిమా ఈ దశకు వచ్చింది” అని అభిప్రాయపడ్డారు.
ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. త్వరలో రిలీజ్ తేదీ ప్రకటించనున్నట్లు సమాచారం.
Read More : హరిహర వీరమల్లు టికెట్ ధరలకు ఏపీ గ్రీన్‌సిగ్నల్

One thought on “పవన్ కళ్యాణ్ భావోద్వేగ ప్రసంగం:”
Comments are closed.