టీటీడీ సస్పెన్షన్‌పై బండి సంజయ్ స్పందన

తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) అన్యమతానికి చెందిన నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన ఘటనపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. టీటీడీలో పనిచేస్తూ క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారని విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ – ‘‘మా డిమాండ్‌కు అనుగుణంగా నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇది ఒక మంచి ప్రారంభం మాత్రమే. తిరుమల వంటి పవిత్ర స్థలంలో హిందువులు కానివారు పనిచేయడం సమంజసం కాదు. ఇప్పటికీ టీటీడీలో అనేకమంది హిందువేతరులు పని చేస్తున్నట్టు సమాచారం ఉంది. వారినీ వెంటనే తొలగించాలి’’ అని డిమాండ్ చేశారు.

ఈ వ్యాఖ్యలు తిరుమలలో ఉద్యోగ నియామకాలపై మళ్లీ చర్చకు దారితీశాయి.

Read More : తిరుమలలో టీటీడీ ఉద్యోగుల సస్పెన్షన్

One thought on “టీటీడీ సస్పెన్షన్‌పై బండి సంజయ్ స్పందన

Comments are closed.